ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్తను చంపిన అల్లుడు... ఆస్తి తగాదానే కారణం! - Property fight isuues news

ఆస్తి తగాదా.. హత్యకు కారణమైంది. తల్లితో సమానంగా ఆదరించాల్సిన అత్తను.. సొంత అల్లుడే అంతమొందించాడు. శ్రీకాకుళంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

death
మృతురాలి పాతచిత్రం

By

Published : Apr 10, 2021, 1:47 PM IST

ఆస్తి పంపకాల విషయంలో విభేదాలతో అల్లుడు.. అత్తను చంపిన ఘటన శ్రీకాకుళంలో జరిగింది. ఎచ్చెర్ల మండలం పెద్దకొంగరాం గ్రామానికి చెందిన అమ్మాయమ్మ తన పెద్ద కుమార్తెను... సోదరుడైన చిట్టి ప్రసాద్‌కిచ్చి కొన్నేళ్ల కిందట వివాహం జరిపించింది. పెళ్లి సమయంలో 33 సెంట్ల భూమిని కట్నంగా ఇచ్చింది. మూడ్రోజుల కిందట అమ్మాయమ్మ.. శ్రీకాకుళంలో ఉంటున్న అల్లుడిని చూసేందుకు వచ్చింది.

మాటల మధ్యలో కట్నంగా ఇచ్చిన 33 సెంట్ల భూమిలో.. 6 సెంట్లను తన చిన్న కుమార్తెకు ఇస్తానని చెప్పింది. ఈ విషయంలో అమ్మాయమ్మతో ప్రసాద్‌ గొడవకు దిగాడు. మాటా మాటా పెరిగి ప్రసాద్‌ రోకలిబండతో ఆమె తలపై బాదాడు. తీవ్ర రక్తస్రావంతో చావు బతుకుల్లో ఉన్న అమ్మాయమ్మను జీజీహెచ్​కు​ తరలించారు. చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందినట్లు రెండో పట్టణ సీఐ వెంకటరమణ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details