శ్రీకాకుళం జిల్లా రాజాంలో పలు ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజాం టౌన్ సిఐ సోమశేఖర్ కథనం ప్రకారం... ఈనెల 15న పట్టణంలోని ఆలయాల్లో కాకర్ల కృష్ణ చోరీకి పాల్పడ్డాడు.రాజాంలోని పచ్చల వీధిలోనున్న కన్యకా పరమేశ్వరి ఆలయంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో రెండు కేసుల్లో కృష్ణ నిందితుడిగా ఉన్నాడు. అతని వద్ద నుంచి ఓ స్క్రూడ్రైవర్‌తో పాటు 12 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయిలకు గిఫ్టులు కొనిచ్చేందుకు డబ్బులు లేక... చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు.
అమ్మాయిలకు గిఫ్టులివ్వడానికి... ఆలయాల్లో చోరీ! - cctv fottage
అమ్మాయిలకు గిఫ్టులివ్వడానికి చోరీలకు పాల్పడుతున్నాడో దొంగ. ఆ చోరీకి ఆలయాలను ఎంచుకున్నాడు. ఆ డబ్బులతో ఆహ్లాదంగా గడుపుతున్నాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
ఆలయాల్లో దొంగతనం చేసిన వ్యక్తి అరెస్టు