శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ కూడలిలో ద్విచక్రవాహనం, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. జలుమూరు మండలం ఇమిడిచెట్లవానిపేట గ్రామానికి చెందిన గొల్లంగి వెంకటరమణ(19), పులి వినయ్తో కలిసి తిలారు నుంచి నిమ్మాడ వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఎస్ఐ లక్ష్మణరావు సంఘటనస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
కోటబొమ్మాళిలో లారీ ఢీకొని యువకుడు మృతి - The man who collided with the lorry died
ద్విచక్రవాహనం, లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో జరిగింది. ప్రమాదంలో మరో యువకుడికి గాయలయ్యాయి.
లారీ ఢీకొని వ్యక్తి మృతి