శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో బట్టల షాపులు తెరిపించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షులు జె. వెంకటేశ్వరరావు , గుడ్ల బాబులు సభాపతి తమ్మినేని సీతారాంకు వినతిపత్రం అందించారు.
లాక్ డౌన్ కారణంగా.. విక్రయాలు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని సభాపతి.. వారికి హామీ ఇచ్చారు.