ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నేత జన్మదిన వేడుకల్లో .. అమ్మాయిలతో ఎస్సై డ్యాన్స్.. ఆ తరువాత - Tekkali Si Dance

SI Dance: అసాంఘిక కార్యకాలపాలు జరిగితే నిరోదించాల్సిన పోలీస్ ఎస్సై.. అర్ధనగ్న నృత్యాలు చేస్తున్న అమ్మాయిలతో డ్యాన్స్ వేశాడు. అధికార పార్టీ నేత జన్మదిన వేడుకల్లో కదా..! ఎవరు ఏమి చేయరులే అని భావించి ఉంటాడు. కాని ఉన్నతాధికార్లకు విషయం తెలిసి.. ఆ ఎస్సై ని వీఆర్ కు పంపించారు.

Si Dance
చిందులేసిన ఎస్​ఐ

By

Published : Nov 6, 2022, 11:19 AM IST

Si Dance In Birthday Party: వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎస్‌ఐ సీహెచ్ హరికృష్ణ చిందులేశారు. శుక్రవారం రోటరీ నగర్లో జరిగిన కార్యక్రమంలో అమ్మాయిలతో కలిసి స్టెప్పులేశారు. అర్ధనగ్న నృత్యాలను ఆపాల్సిన ఎస్‌ఐ అందుకు విరుద్ధంగా తానే డ్యాన్సులు వేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఈ వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి.

స్పందించిన ఉన్నధికారులు:టెక్కలిఎస్​ఐ హరికృష్ణ నిర్వాకంపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు స్పందించారు. దీంతో ఎస్‌ఐ పై వేటు పడింది. హరికృష్ణను వీఆర్‌కు పంపిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అమ్మాయిలతో కలిసి చిందులేసిన టెక్కలి ఎస్​ఐ హరికృష్ణ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details