శ్రీకాకుళం జిల్లా రాజాంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ... ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులుకు వినతిపత్రాన్ని సమర్పించారు. 1980 పెన్షన్ రూల్స్‌ను పునరుద్ధరిస్తూ కొత్త జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
'సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి'
శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి వినతిపత్రాన్ని స్థానిక ఎమ్మెల్యేకు సమర్పించారు.
ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పిస్తున్న ఉద్యోగులు