ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధాన్యం బకాయిలు చెల్లించాలని తెదేపా నిరసన

ధాన్యం బకాయిలు చెల్లించాలని తెదేపా శ్రేణులు పలు జిల్లాల్లో ఆందోళన చేపట్టాయి. రబీ సీజన్​లో ధాన్యం కొనుగోలు చేసి రెండు, మూడు కావొస్తున్నా నగదు చెల్లించకపోవడం సరికాదని పలువురు నేతలు విమర్శించారు. కౌలు రైతులకు రుణ పరిపతి కల్పించాలని తెదేపా నేత కూన రవికుమార్.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

tdp state wide protest
tdp state wide protest

By

Published : Jun 19, 2021, 7:28 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెదేపా నేత కూన రవికుమార్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన తెదేపా నేతలు.. వరుస విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. అన్నదాతలకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలు సరైన సమయంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని రవికుమార్ చెప్పారు. పంట కాలువల నిర్వహణ సక్రమంగా లేదన్న ఆయన.. కౌలు రైతులకు రుణ పరపతి కల్పించాలన్నారు.

నెల్లూరు జిల్లాలో..

తెలుగు రైతు ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు నాయకులు ధర్నా చేపట్టారు. రబీ సీజన్​లో ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి రెండు, మూడు నెలలు గడుస్తున్నా నేటికీ డబ్బులు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని.. సత్వరమే వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. నాట్ల సీజన్ మొదలైందని.. పెట్టుబడులకు డబ్బులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సమస్యల గురించి పట్టించుకోవాలని చెప్పారు.

కర్నూలు జిల్లాలో..

రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవటంలో పూర్తిగా విఫలమైందని.. తెదేపా ఆరోపించింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కర్నూలు పార్లమెంట్​ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.. డీఆర్ఓ పుల్లయ్యకు వినతిపత్రం అందించారు. ధాన్యం బకాయిలు చెల్లించాలని సోమిశెట్టి కోరారు.

ఇదీ చదవండి:Devineni: 'దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచేస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details