తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇళ్లను.. డీడీలు కట్టిన లబ్ధిదారులకు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలు ధర్నా చేశారు. పాత్రునివలసలో మొదటి విడతలో నిర్మాణం పూర్తి అయిన 12 వందల 50 ఇళ్లను కేటాయించిన లబ్ధిదారులకు తక్షణమే పంపిణీ చేయాలని కోరారు. వీరందరికీ ఇళ్లను కేటాయిస్తూ తగిన పత్రాలను కూడా తెదేపా అందజేశామన్నారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడం.. అప్పుడు కేటాయించిన వ్యక్తులకు కాకుండా.. ఇప్పుడు వేరే వారికి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మండిపడ్డారు.
'తెదేపా హయాంలో డీడీలు కట్టిన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలి'
తెలుగుదేశం ప్రభుత్వం హయంలో నిర్మించిన ఇళ్లను.. డీడీలు కట్టిన లబ్ధిదారులకు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. ఈ విషయంపై శ్రీకాకుళం జిల్లాలోని పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలు ధర్నా చేశారు.
లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని తెదేపా నేతల ఆంధోళన