పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశ పెట్టిందని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి వైఎస్సార్ బీమా ప్రారంభ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభాపతి పాల్గొన్నారు. అర్హులైన వారికి బీమా చెక్కులను అందించారు. జిల్లాలో 408 మంది పేద వారు ఈ పథకం కింద 8 కోట్ల 76 లక్షలను పొందారని చెప్పారు.
కేంద్రం చేతులెత్తేసినా.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఈ పథకానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ మరణించిన 12 వేల 39 మంది కుటుంబాలకు మానవతా దృక్పథంతో.. బీమాకు సమానమైన 2 వందల 54 కోట్ల మొత్తాన్ని చెల్లించామని తెలిపారు.