ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వామిని తాకిన సూర్య కిరణాలు - devotees

నిన్న స్వామి వారిని తాకకుండా భక్తులను నిరాశపరిచిన సూర్యకిరణాలు... నేడు భాస్కరుని తాకి కనువిందు చేశాయి.

సూర్య భగవానుడిని తాకిన సూర్యకిరణాలు

By

Published : Mar 10, 2019, 10:14 AM IST

భాస్కరుని చెంత బంగారు కిరణాలు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యదేవాలయంలో అద్భుత ద్యశ్యం ఆవిష్కృతమైంది. బంగారు రంగులో లేలేత సూర్య కిరణాలు స్వామివారి మూలవిరాట్టును తాకాయి. ఉత్తరాయనం నుంచి దక్షిణాయనానికి మారే సందర్భంలో ఈ కిరణ స్పర్శ భాస్కరుని తాకుతుంది. స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా మార్చి 9,10 తేదిల్లో... అలాగే అక్టోబర్ నెల 1, 2 తేదీల్లో భక్తులకు కనువిందు చేస్తుంది. కేవలం 3 నుంచి 4 నిమిషాల పాటు మాత్రమే ఈ దృశ్యం కనిపిస్తుంది. పంచద్వారాలను దాటి సూర్యకిరణాలుగాలిగోపురం మధ్య నుంచి ఆదిత్యుని తాకుతుంటాయి. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా సుదీర్ఘ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. కానీ నిన్న మేఘాలు అడ్డుపడి కిరణాలు స్వామివారిని తాకలేదు.

ABOUT THE AUTHOR

...view details