ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన సూర్య కిరణాలు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకాయి. ఆ సమయంలో స్వామి నామస్మరణ చేస్తూ భక్తులు పులకరించిపోయారు.

sun rays hit arasavelli surya narayana swamy
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన సూర్యకిరణాలు

By

Published : Mar 10, 2021, 7:53 AM IST

Updated : Mar 10, 2021, 10:25 AM IST

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని భానుడి కిరణాలు ఈ ఉదయం తాకాయి. ఉదయం ఆరు నిమిషాల పాటు సూర్య కిరణాలు మూలవిరాట్‌ను స్పృశించిన అద్భుత దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు.

ప్రతి ఏటా మార్చి 9, 10 తేదీల్లో స్వామి వారిని సూర్యకిరణాలు తాకడం ఇక్కడ ఆనవాయితీ. మళ్లీ అక్టోబర్‌ 1,2 తేదీల్లోనూ ఈ అపురూప దృశ్యం సాక్షాత్కారం అవుతుంది. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో చోటుచేసుకునే ఈ అద్భుతాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు.

అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన సూర్యకిరణాలు

ఇదీ చదవండి:పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్.. వరదార్పణం

Last Updated : Mar 10, 2021, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details