రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఏఎంసీ చైర్మన్ చాట్ల సుజాత పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయ కేంద్రాల వద్ద రైతులకు విత్తనాల పంపిణీ చేశారు. రైతులకు కావలసిన విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సుజాత అన్నారు. రైతులకు రాయితీపై అందిస్తున్న విత్తనాలు ప్రతి ఒక రైతు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
సచివాలయ కేంద్రాల్లో విత్తనాల పంపిణీ
ఇచ్చాపురం మున్సిపాలిటి పరిధిలోని సచివాలయ కేంద్రాల వద్ద రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చాట్ల సుజాత, తులసి దాస్రెడ్డి పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇచ్చాపురం పరిధిలోని సచివాలయ కేంద్రాల్లో రైతులకు విత్తనాలు అందిస్తున్న ఏఎంసీ చైర్మన్ సుజాత
TAGGED:
icchapuram latest news