ప్రజల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా. ఎస్. అప్పలరాజు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పేరుతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని గర్భిణీ స్త్రీలకు అందిస్తున్నామన్నారు. నాడు-నేడు పథకం ద్వారా స్కూళ్లను అభివృద్ధి చేశామని చెప్పారు. అమ్మఒడి పేరుతో డబ్బులు అందిస్తూ.. ప్రతి విద్యార్థిని చదివిస్తున్నామని పేర్కొన్నారు.
పలాస-కాశీబుగ్గలో మంత్రి అప్పలరాజు ఎన్నికల ప్రచారం - State Animal Husbandry Minister latest news
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలోని పలు వార్డుల్లో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా. ఎస్. అప్పలరాజు ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలకు వైకాపా ప్రభుత్వం.. సంక్షేమ పథకాలు అందిస్తోందని ఆయన అన్నారు.
రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా.ఎస్ అప్పలరాజు