ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంగర సంగమేశ్వరాలయాన్ని ముంచెత్తిన గంగమ్మ - srikakulam rain news

వరద ప్రవాహానికి శ్రీకాకుళం జిల్లాలోని వంగరలో సంగమేశ్వరాలయం నీట మునిగింది. నాగావళి నదిలోకి ఒక్కసారిగా నీటి విడుదల చేయడం వల్లే ఈ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది.

srikakulam-temple

By

Published : Oct 12, 2019, 10:29 AM IST

Updated : Oct 12, 2019, 1:23 PM IST

శ్రీకాకుళంలో నీట మునిగిన సంగమేశ్వరాలయం

శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని సంగమేశ్వర ఆలయం నీటమునిగింది. సువర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతాల్లో గురువారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి మడ్డువలస జలాశయానికి వరద నీరు పోటెత్తింది. మడ్డువలస నిర్వాసిత గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. 9 గేట్ల ద్వారా 40 వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడుదల చేశారు అధికారులు.ఒక్కసారిగా పెరిగిన ఈ వరదతో సంగమేశ్వర ఆలయంలోకి నీరు చేరింది. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టినందున మడ్డువలస ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు.

Last Updated : Oct 12, 2019, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details