కాంగో దేశంలో శ్రీకాకుళం జిల్లా వాసుల నరకయాతన - africa
పొట్ట కూటి కోసం... దేశం కాని దేశం వస్తే ఆ పొట్టకే పస్తులుండేలా చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా వాసుల కన్నీటి పర్యంతమయ్యారు. ఏజెంట్ మోసంతో... కాంగో దేశంలో నరకయాతన అనుభవిస్తున్నాం..రక్షించండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో శ్రీకాకుళం జిల్లా వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. పొట్టకూటి కోసం... ఓ ఏజెన్సీని నమ్మి అక్కడికెళ్లి.... మోసపోయామని గుర్తించి అల్లాడిపోతున్నారు. విశ్రాంతి లేకుండా పని చేస్తూ... అర్ధాకలితోనే అలమటిస్తున్నారు. జీతం అడిగితే... ఇష్టారాజ్యంగా కొడుతున్నారని... జైల్లో వేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఒక్కసారి జైలుకు వెళ్లితే... అక్కడి చట్టాల ప్రకారం తిరిగి బయటకు రావడం కష్టమని తెలిసి... ఎన్ని కష్టాలు పెట్టిన అనుభవిస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నామంటూ... కన్నీటిపర్యంతమయ్యారు. తమ బాధల ఫోటోలను, వీడియోల రూపంలో ఈటీవీ భారత్ కు పంపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను స్వదేశానికి తీసుకువచ్చేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు.