శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 138 కేంద్రాల్లో 37 వేల 203 మంది అభ్యర్థులు పంచాయతీ కార్యదర్శుల నియామక పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేసి.. 144 సెక్షన్ విధించారు. నరసన్నపేట నియోజకవర్గంలో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4 వేల 704 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని 4 మండలాల్లో 1700 మంది దరఖాస్తు చేసుకోగా.. 40 శాతం మంది అభ్యర్థులే పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. లావేరు, బెజ్జిపురం పరీక్ష కేంద్రాలను సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఆదిత్య లక్ష్మి తనిఖీ చేశారు. ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలోని 13 కేంద్రాల్లో 3 వేల 168 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తహశీల్దార్ కేవీవీ శివ చెప్పారు. ఎండ వేడితో ఇబ్బంది పడే వారికి వైద్య సదుపాయం ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా పంచాయతీ కార్యదర్శి నియామక పరీక్ష - etcherla
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా.. పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల నియామక పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ కార్యదర్శి నియామక పరీక్ష