శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి సమీపంలోని వంశధార కుడి ప్రధాన కాలువకు గండి పడింది. కాలువకు నీరు విడిచి పెట్టే ముందు కనీసం కాలువ పరిస్థితిని పరిశీలించకుండానే వంశధార అధికారులు నీరు విడిచి పెట్టారని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గండితో సరుబుజ్జిలి, శరభాపురం, మూలసవలాపురం, తురకపేట తదితర గ్రామాలకు చెందిన 200 ఎకరాల పంటపొలాలు ముంపునకు గురయ్యాయని కర్షకులు చెబుతున్నారు. అన్నదాతలు అధికారులకు సమాచారం ఇచ్చిన ఈ ఏమాత్రం పట్టించుకోలేదని వాపోతున్నారు. సాగునీరు వృధాగా పోతుందనీ.... ఏమీ చేయాలేని పరిస్థితిలో ఉన్నామని రైతన్నలు అంటున్నారు.
వంశధారకు గండి... వందల ఎకరాల్లో పొలాలకు ముంపు
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి సమీపంలో వంశధార కుడి ప్రధాన కాలువకు గండి పడింది. దీంతో వందల ఎకరాల్లో పంటపొలాలు ముంపునకు గురయ్యాయి అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గండిపడటంతో కొట్టుకొస్తున్న వరద