ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ గ్రామంలో ఎన్నికల సందడి.. ఒక్క వీధిలోనే - ఏపీ లోకల్ పోల్ న్యూస్

ఒక ఊరు.. ఆ ఊరికి మధ్యలో కంచె.. ఇటు వాళ్లు అటు వెళ్లరు. అటు వాళ్లు ఇటు రారు. వస్తే.. యుద్ధమే.. అది సినిమా. కానీ. మన రాష్ట్రంలోని ఓ గ్రామంలో రెండు వీధులు. ఆ గ్రామంలోని ఎవరైనా.. ఎటైనా వెళ్తారు. కానీ ఏపీ ఎన్నికల్లో మాత్రం ఒక వీధి వాళ్లే ఓటేస్తారు. మరో వీధి వాళ్లు అసలు పట్టించుకోరు. అలా అని... పగలు, ప్రతీకారాలు అనుకోకండి. దానికో లెక్కుంది. ఆ లెక్కకో స్టోరీ ఉంది.

srikakulam district manikaypatnam villages in two states
srikakulam district manikaypatnam villages in two states

By

Published : Mar 14, 2020, 11:51 PM IST

ఆ గ్రామానికి వెళ్తే అంతా కలిసి మెలిసి ఉంటారు. మరో వీధి వారి ఎన్నికల్లో.. ఇంకో వీధి వారు మాత్రం అసలు వేలుపెట్టారు. అంటే సిరా చుక్క వేసుకోరు. ఎందుకంటే ఆ గ్రామం రెండు రాష్ట్రాల పాలనలో ఉంది. ఒక వీధేమో.. ఆంధ్రప్రదేశ్​ది కాగా.. మరో వీధి ఒడిశా రాష్ట్రానిది. పక్కన కాలుపెడితే వేరే రాష్ట్రానికి సెకనులో చేరిపోవచ్చన్నమాట. ఆ గ్రామం పూర్తి వివరాలివి.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం సాబకోట పంచాయతీ పరిధిలోని శివారు గ్రామం (ఐదో వార్డు) మాణిక్యపట్నం. భౌగోళికంగా తూర్పు దిక్కు నుంచి చూస్తే.. కుడివైపు వీధి ఆంధ్రప్రదేశ్. ఎడమవైపు వీధి ఒడిశా రాష్ట్రానిది. రెండు వీధుల మధ్యలోంచి ఎగువ ప్రాంతంలోని గ్రామాలకు వెళ్లేందుకు ఒడిశా ప్రభుత్వం నిర్మించిన రోడ్డే సరిహద్దు. ఈ గ్రామం అటు ఒడిశాకు.. ఇటు ఆంధ్రప్రదేశ్​కు ముఖద్వారం. ఈ గ్రామంలోని 47 కుటుంబాలు ఉన్నాయి. ఆంధ్రాలో ఉన్న కుడి వీధిలో 26 కుటుంబాలు, 75 మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక ఎన్నికల సందడి నేపథ్యంలో మాణిక్యపట్నంలో విచిత్ర పరిస్థితి ఉంది. ఒక వీధిలో ఎన్నికల సందడి ఉంటే.. పక్కనున్న ఒడిశా వీధి నిశ్శబ్ధంగా ఉంది.

పోలింగ్ కేంద్రం.. చాలా దూరం

మాణిక్యపట్నం.. సాబకోటకు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి వారు ఓట్లేసేందుకు కాలినడకన వెళ్తారు. ప్రతి ఎన్నికల్లోనూ.. ఇదే పరిస్థితి. స్థానిక ఎన్నికల ఆవిర్భావం నుంచి ఈ గ్రామంలోని ఓటర్లంతా ఐకమత్యంతో వార్డు సభ్యుడిని ఏకగ్రీవంగా ఎన్నుకొంటారు. ఇక్కరి వారంతా సర్పంచ్ ఓట్ల కోసం సాబకోటకు వెళ్తారు.

ఇదీ చదవండి:

ఏ-ఫారం.. బీ-ఫారం అంటే ఏంటి సార్?

ABOUT THE AUTHOR

...view details