ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాల ఆవరణంలో చెత్త.. ఏరివేసిన జిల్లా కలెక్టర్ - వన్పనీలమ్మ కాలనీలో సచివాలయాన్ని తనిఖీ

పాలకొండ పట్టణంలో నాడు-నేడు పనులను శ్రీకాకుళం జిల్లా పాలనాధికారి పరిశీలించారు. పెద్ద కాపు వీధి పాఠశాల అపరిశుభ్రంగా ఉండటంతో స్వయంగా ఆయనే చెత్తను ఏరివేశారు. ప్రధానోపాధ్యాయుని పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ సచివాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా ఉంచుకోవాలని హెచ్చరించారు.

srikakulam District Collector Inspections
పాఠశాల ఆవరణంలో చెత్త.. ఏరివేసిన జిల్లా కలెక్టర్

By

Published : Nov 6, 2020, 9:11 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలనాధికారి శ్రీనివాస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు-నేడు పనులను పరిశీలించేందుకు పాలకొండ పట్టణంలో ఆయన పర్యటించారు. పెద్ద కాపు వీధి పాఠశాల పరిశుభ్రంగా లేకపోవడంతో ఆయనే స్వయంగా చెత్తను ఏరివేశారు. బడి ఫ్లోరింగ్ సక్రమంగా లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సరిగ్గా అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులు జామి రవిని హెచ్చరించారు. వన్పనీలమ్మ కాలనీలో సచివాలయాన్ని తనిఖీ చేసిన ఆయన, రికార్డుల వివరాలు ఆరాతీశారు.

ABOUT THE AUTHOR

...view details