కరోనా బాధితులకు వైద్య సేవలు అందించి మన్ననలు పొందాలని పీజీ వైద్యులను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ కోరారు. కరోనా చికిత్సలో పాల్గొననున్న పీజీ వైద్యుల శిక్షణా కార్యక్రమం శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగింది. వైద్య వృత్తి గొప్పదని.. ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం కరోనా రోగులకు చికిత్స అందించడం మహోన్నతమైనటువంటి సేవ అని కలెక్టర్ అన్నారు. వైరస్ బారిన పడినవారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాలని కలెక్టర్ నివాస్ పిలుపునిచ్చారు.
కరోనా రోగులకు చికిత్స చేయడం.. మహోన్నత సేవ..: కలెక్టర్ నివాస్ - శ్రీకాకుళంలో కరోనా
కరోనా రోగులకు చికిత్స చేయడం మహోన్నత సేవ అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ అన్నారు. కరోనా చికిత్సలో పాల్గొననున్న పీజీ వైద్యుల శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
కలెక్టర్ నివాస్