బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ పెను తుపానుగా మారుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. అంపాన్ తుఫాను వలన 20వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న కలెక్టర్.. జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించిన కలెక్టర్.. తుపాను పశ్చిమ బంగా.. బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపిందన్నారు. దీని ప్రభావం వలన ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లో వర్షపాతం ఎక్కువగా పడే అవకాశం ఉందని కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు.
అంపన్ పెను తుపాను: ప్రజలారా జాగ్రత్తగా ఉండండి
బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ పెను తుపానుగా మారుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించిన కలెక్టర్.. తుపాను పశ్చిమ బంగా.. బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపిందన్నారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్