శ్రీకాకుళం జిల్లాకు రూ.1510కోట్ల రుణాలు:వ్యవసాయ శాఖ జె.డి - srikakulam
ప్రకృతి వ్యవసాయంపై శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వ్యవసాయ సంచాలక కార్యాలయంలో రైతులు, ఎంపీఈవోల సమావేశం జరిగింది. జిల్లాలో ఖరీఫ్ కాలానికి 15వందల 10కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు జేడీ రత్నకుమార్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాకు రూ.1510కోట్ల రుణాలు:వ్యవసాయ శాఖ జె.డి
శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ కాలానికి 15 వందల10 కోట్ల పంట రుణాలు ఇస్తామని వ్యవసాయ శాఖ జె.డి రత్న కుమార్ తెలిపారు. నరసన్నపేట వ్యవసాయ సహాయ సంచాలక కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై ఎంపీఈవోల సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా విత్తనాలకు ఎటువంటి కొరత లేదని.. 50 శాతం రాయితీపై మొక్కజొన్న విత్తనాలు సరఫరా చేస్తున్నట్టు రత్నకుమార్ తెలిపారు.