ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ రహదారిపై చుక్కల జింక మృతి

అడవులు అంతరించిపోవడంతో కొన్ని అటవీ జంతువులు గ్రామాల్లోకి వస్తుండగా.. మండుతున్న ఎండల ధాటికి నీరు లేక మరికొన్ని మృత్యువాత పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం వైకుంఠపురంలో ఓ చుక్కల జింక ఇదే తరహాలో మరణించడం.. అడవి జంతువులకు రక్షణ కరువైందని చెప్పడానికి నిదర్శనంగా మారింది.

spotted deer died in vykuntapuram
నీరులేక జింక మృతి

By

Published : May 13, 2021, 6:02 PM IST

మృతి చెందిన జింక

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం వైకుంఠపురంలో.. పాలకొండ వైపు వెళ్లే జాతీయ రహదారిపై వస్తున్న చుక్కల జింక స్పృహ తప్పి పడిపోయింది. బతికించేందుకు గ్రామ యువకులు ప్రయత్నం చేసినా ఫలించక ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని సర్పంచ్ బొడ్డేపల్లి వెంకటసత్యంకు యువకులు తెలియజేశారు.

ఇదీ చదవండి:వలస కార్మికులకు రేషన్ ఇవ్వండి: సుప్రీం

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా జరిపించారు. వెటర్నరీ అస్టింట్ సర్జన్ డాక్టర్ హేమలత పోస్ట్ మార్టం నిర్వహించగా.. ఫారెస్టు సెక్షన్ అధికారి ఎల్ ధర్మారావు, బీట్ అధికారి జాకీర్ అలిబేగ్, రాజేంద్రప్రసాద్ దహన సంస్కారాలు జరిపారు. జింకను బతికించేదుకు యత్నించిన యువకులను అటవీశాఖ అధికారులు అభినందించారు.

ఇదీ చదవండి:

తెదేపా మాజీ సర్పంచ్ దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details