శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాల్లో సభాపతి తమ్మినేని సీతారాం పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ చర్యలు చేపడితే... స్థలాలు పంపిణీ చేయకుండా తెదేపా అధినేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని... ప్రజా సంక్షేమానికి అడ్డుతగలటం సమంజసం కాదన్నారు.
అభివృద్ధి పనులకు సభాపతి తమ్మినేని శ్రీకారం - సభాపతి తమ్మినేని శ్రీకాకుళం పర్యటన
సభాపతి తమ్మినేని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పలు అభివృద్ధి పనులకు సభాపతి తమ్మినేని శ్రీకారం