శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని ఖంట్లం, ఓ.వి.పేట, లచ్చయ్యపేట గ్రామాల్లో శాసనసభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు.
గ్రామస్థాయిలో మెరుగైన పాలన అందించటం కోసం సచివాలయ వ్యస్థను తీసుకొచ్చామని చెప్పారు. జలకళ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని తెలిపారు. రైతుల సంక్షేమానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారన్నారు.