ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యారంగంలో త్వరలో అద్భుతాలు: సభాపతి తమ్మినేని - సభాపతి తమ్మినేని తాజా వార్తలు

విద్యకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని... ప్రతి విద్యార్థి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సభాపతి తమ్మినేని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

విద్యారంగంలో త్వరలో అద్భుతాలు: సభాపతి తమ్మినేని
విద్యారంగంలో త్వరలో అద్భుతాలు: సభాపతి తమ్మినేని

By

Published : Oct 10, 2020, 6:33 PM IST

Updated : Oct 10, 2020, 6:55 PM IST

రాబోయే రోజుల్లో విద్యారంగంలో అద్భుతాలు జరగబోతున్నాయని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. విద్యకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో జగనన్న విద్యాకానుక వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు.

పని చేయని ప్రభుత్వంపై ఓటు అనే ఆయుధంతో పోటు వేస్తారని.. గత ప్రభుత్వంపై అదే జరిగిందని వ్యాఖ్యానించారు. ప్రజలకు కావాల్సిన పనులు గ్రామ సచివాలయాల ద్వారా జరిగిపోతున్నాయన్నారు. వెదుల్లవలస గ్రామంలో రైతు భరోసా కేంద్ర నిర్మాణానికి లక్షలు విలువ చేసే స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన మర్రిపెద్ద వెంకటరమణను సభాపతి అభినందించారు.

Last Updated : Oct 10, 2020, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details