కరోనా నుంచి సమాజాన్ని కాపాడుకునేందుకు అంతా కలిసికట్టుగా పోరాడాలని సభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. కరోనా కనిపించని శత్రువు అన్నారు. రాజకీయాలకు తావు లేకుండా.. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని శ్రీకాకుళంలో అధికారులకు చెప్పారు. సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చే వారిని పోలీసులు ఉపేక్షించవద్దన్నారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలని కోరారు. కలెక్టరు, ఎస్పీలు ఇచ్చే ఆదేశాలు పాటించాలని చెప్పారు.
అధికారులూ.. తీసుకోండి కఠిన నిర్ణయాలు: సభాపతి తమ్మినేని - speaker tammineni sitharam comments on corona
కరోనా మహమ్మారిని నియంత్రించడానికి రాజకీయాలకు తావు లేని నిర్ణయాలను అధికారులు తీసుకోవాలని సభాపతి తమ్మినేని సీతారాం కోరారు. అనవసరంగా రోడ్ల పైకి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దన్నారు.
సభాపతి తమ్మినేని సీతారాం