రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. బొబ్బిలిపేటలో రూ. 6 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. వైయస్సార్ ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. తురకపేటలో రైతు భరోసా కేంద్రం, నెల్లిపర్తిలో వైయస్సార్ ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన చేశారు.
సభాపతి మాట్లాడుతూ.. సీఎంకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివన్నారు. అవినీతిరహిత పాలన అందించడం కోసం ముఖ్యమంత్రి జగన్ నిరంతరం తపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.