రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లక్ష్మీనగర్ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులను సభాపతి పరిశీలించారు. పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు మంజూరు చేశారని వివరించారు. నాణ్యతతో పనులు వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు.
'రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోంది' - ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం వార్తలు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లక్ష్మీనగర్ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో నాడు -నేడు పనులను స్పీకర్ తమ్మినేని సీతారాం పరిశీలించారు. నాణ్యతతో పనులు వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆమదాలవలసలో నాడు నేడు పనుల పరిశీలన