శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శ్రీ ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీ పంచాయతన - సూర్యారాధన, సౌరయాగం ఘనంగా ముగిసింది. గత నెల 27 నుంచి 12 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఉదయం పంచాయతన అభిషేకం, మహాసౌర, అరుణ మంత్ర పూర్వక సూర్య నమస్కారాలు, సహస్రనామార్చన, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం స్వామివారి కల్యాణోత్సవం జరిపించారు.
సూర్య నారాయణమూర్తి ఆలయంలో ముగిసిన సౌరయాగం - srikakulam narasanna peta news update
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీ పంచాయతన - సూర్యారాధన, సౌరయాగం ఘనంగా ముగిసింది. వేద పండితులు జోస్యుల సుందర వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు వైభవంగా జరిపించారు.
సూర్యనారాయణ స్వామి ఆలయంలో యాగం