ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీముఖలింగేశ్వరుడికి చక్రతీర్థం - devotees

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగ క్షేత్రంలో స్వామివారికి చక్రతీర్థాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు లక్షలాదిగా తరలివచ్చి వంశధార నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

శ్రీముఖలింగం

By

Published : Mar 7, 2019, 6:19 PM IST

శ్రీముఖలింగ చక్రతీర్థ స్నానాలు
కైలాసవాసుడు కొలువైన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీ ముఖలింగం క్షేత్రంలో స్వామి వారికి చక్రతీర్థ స్నానాలు వైభవంగా జరిగాయి. వంశధార నదిలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామివారిని ఆలయం నుంచి శోభాయమానంగా అలంకరించి ఊరేగించారు. భక్తులు లక్షలాదిగా తరలివచ్చి నీలకంఠుడిని దర్శించుకున్నారు. నదిలో పుణ్యస్నానాలు చేశారు. జిల్లా ఎస్పీ వెంకటరత్నం బందోబస్తును పర్యవేక్షించారు.

ABOUT THE AUTHOR

...view details