శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా భక్తులు సామూహిక వ్రతాలు ఆచరించారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కుటుంబ సమేతంగా పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉంటారని.. పాడి పంటలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బుడుమూరు శ్రీనివాస్‌తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏకాదశి రోజున సామూహిక వ్రతాలు - srikakukam
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా భక్తులు సామూహిక వ్రతాలు ఆచరించారు.
ఏకాదశి రోజున సామూహిక వ్రతాలు