శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని నాగావళి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు వాహనాలను సీజ్ చేశారు. గనుల శాఖ అధికారులకు వాహనాలను అప్పగించినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. పాలకొండ మండలంలో అధికారికంగా ఇసుక ర్యాంపులు లేకపోవడంతో అక్రమార్కులు ఇసుకను దోచుకొని సొమ్ము చేసుకుంటున్నారు.
నాగావళిలో ఇసుక దొంగలు... వాహనాల సీజ్ - srikakulam
శ్రీకాకుళం జిల్లాలో నాగావళి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.
వాహనాలు పట్టివేత