ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ డిపోలో కార్మికలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాంతీయ కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ...ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, అద్దె బస్సులు తగ్గించి ఆర్టీసీ బస్సులను పెంచాలన్నారు. అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
'ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న యాజమాన్య ఏకపక్ష నిర్ణయాలు సరైనవి కావని శ్రీకాకుళం జిల్లా ఆర్టీసీ కార్మికుల ప్రాంతీయ కార్యదర్శి వ్యాఖ్యానించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పాలకొండ డిపోలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
'ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'