శ్రీకాకుళం జిల్లాలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక ఉల్లి పక్కదారి పడుతోంది. కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడంపై వినియోగదారులు మండిపడతున్నారు. బయట మార్కెట్లో ఉల్లి ధర వంద పలుకుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల వద్దే ఉల్లి సరకు నిల్వ ఉండటంతో వారే ఉల్లి ధరలు వారే నిర్ణయిస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొంది. అధికారులు స్పందించిన చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు
శ్రీకాకుళం జిల్లాలో ఉల్లిపాయల ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. జిల్లాలో రోజురోజుకు ఉల్లి ధరలు పెరుగుతుండటంతో సామన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.
శ్రీకాకుళం జిల్లాలో కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు