ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగు ఎండిపోయింది.. పశువులకు మేతైంది

అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వరి పంట చేతికి వస్తుందని ఆశతో ఎదురు చూసిన రైతుకు నిరాశ మిగిలింది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం పలు గ్రామాల్లో పంటకు సాగు నీరు అందక వరి ఎండి పోయింది. దీంతో పొలాల్లో పంటను పశువులకు మేతగా వదిలేశారు.

grain crop in land
పశువులకు మేతగా పొలంలోనే పంట

By

Published : Nov 6, 2020, 8:31 AM IST


సాగు నీరు అందకపోవడంతో వరి పంట పొలాలు ఎండిపోవడంతో పంటను పశువులకు మేతగా పొలాల్లోనే వదిలేశారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం పలు గ్రామాల్లోని మడ్డువలస పిల్ల కాలువ ద్వారా సంతకవిటి మండలంలోని వాల్తేరు, పనస పేట, జి.ఎం పురం, శివకుల పేట తదితర గ్రామాలకు సాగు నీరు అందుతుంది. ఈసారి సకాలంలో వర్షాలు పడక, వరి పంటకు సాగునీరు అందలేదు. దీంతో పొలాల్లోనే వరి పంటను పశువులకు మేతగా విడిచిపెట్టారు.

మడ్డువలస పిల్ల కాలువ ద్వారా సాగునీరు అందకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చూడండి...

ట్రాఫిక్ నిబంధనలపై.. విద్యార్థులతో వినూత్న ప్రదర్శన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details