శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులు సమావేశమయ్యారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పైలెట్ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని పౌరసరఫరాల శాఖ అధికారి ఏ. కృష్ణారావు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని అన్ని గ్రామా పంచాయతీల ఆధ్వర్యంలో రేషన్ వస్తువులు ఇంటింటికి పంపిణీ చేస్తామని వివరించారు. ప్రతి మండలంలోని రేషన్ సరుకులు ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించి వాహనాల ద్వారా రేషన్ డిపో తరలిస్తామని అక్కడినుండి క్లస్టర్‌కు తరలించి...వాలంటీర్లు ద్వారా ఇంటింటికి రేషన్ అందజేయడం జరుగుతుందని కృష్ణారావు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో 2015 రేషన్ షాప్‌లు ఉన్నాయని...13,840 క్లస్టర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
త్వరలో ప్రారంభంకానున్న పైలట్ ప్రాజెక్ట్
ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పైలెట్ ప్రాజెక్ట్‌పై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులు సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో రేషన్ వస్తువులు ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామని తెలిపారు.
పైలెట్ ప్రాజెక్ట్‌పై సమావేశమైన రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు