శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం చోడవరం గ్రామస్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. జిల్లాలో కరోనా కేసులు నమోదు అవుతున్నందునా… ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని అధికారులు కట్టడి చేయకుండా...తమ గ్రామంలోకి తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని పాఠశాలను క్వారంటైన్ కేంద్రంగా మార్చి తరలిస్తున్నారని, ఇలా చేస్తే తమ గ్రామానికి ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు. క్వారంటైన్ కేంద్రం తీసేయకపేతే ఊరుని విడిచి పోతామని చెబుతున్నారు.
'క్వారంటైన్ కేంద్రం తీసేయకపోతే మేమే పోతాం' - శ్రీకాకుళం జిల్లా కరోనా వార్తలు
క్వారంటైన్ కేంద్రాన్ని తొలగించాలంటూ శ్రీకాకుళం జిల్లా చోడవరం గ్రామస్థులు ఆందోళ వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోతే తామే ఊరు విడిచి పోతామని పేర్కొన్నారు.
చోడవరం గ్రామస్థుల ఆవేదన