ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

326ఏ జాతీయ రహదారిలోని నిర్మాణాల తొలగింపు..

326A జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట - పాతపట్నం మధ్య పలు నిర్మాణాలను అధికారులు తొలగించారు. రోడ్డు విస్తరణలో సమస్యగా ఉన్న జలుమూరు మండలం చల్లవానిపేట ప్రధాన కూడలి వద్ద నిర్మాణాలను అధికారులు దగ్గరుండి తొలగించారు.

road widening works
జాతీయ రహదారిలోని నిర్మాణాల తొలగింపు

By

Published : Mar 17, 2021, 5:00 PM IST

రహదారి విస్తరణలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట- పాతపట్నం 326A జాతీయ రహదారిలోని పలు నిర్మాణాలను అధికారులు తొలగించారు. జలుమూరు మండలం చల్లవానిపేట కూడలి వద్ద నిర్మాణాలను యంత్రాలతో తొలగించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, రహదారుల శాఖ అధికారులు ఈ పనులను అక్కడే ఉండి తొలగింపు ప్రక్రియను పర్యవేక్షించారు. 232 కోట్లతో వ్యయంతో రహదారి విస్తరణ పనులు పూర్తి కాగా.. ముఖ్య కూడళ్లలో నిర్మాణాల కారణంగా పనులు నిలిచిపోయాయి. తాజాగా అధికారులు వీటిని తొలగిస్తున్నారు. ఇదిలా ఉండగా రహదారికి ఆనుకుని ఉన్న నిర్మాణాలు తొలగించడం పట్ల లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నిలువ నీడ లేకుండా చేశారని వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details