ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కంటైన్మెంట్ జోన్లను పక్కగా నిర్వహించాలి' - శ్రీకాకుళం జిల్లా ముఖ్యంశాలు

కొవిడ్ కంటైన్మెంట్ జోన్లను పక్కగా నిర్వహించాలని శ్రీకాకుళం ఆర్డీవో, పురపాలక ప్రత్యేకాధికారి ఐ. కిశోర్ ఆదేశించారు. హోమ్​ఐసోలేషన్​లో ఉన్న వారికి ప్రతిరోజు ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

మాట్లాడుతున్నఆర్డీవో కిశోర్
మాట్లాడుతున్నఆర్డీవో కిశోర్

By

Published : May 13, 2021, 9:25 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో కొవిడ్​పై ఆర్డీవో ఐ.కిశోర్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కంటైన్మెంట్ జోన్లను పక్కగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్లలో సిబ్బందికి విధులు కేటాయించి నిశితంగా పరిశీలించాలని తెలిపారు.

అందరికీ హోమ్​ ఐసోలేషన్​ కిట్లను తప్పనిసరిగా పంపిణీ చేయాలని సూచించారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్న చోట ఎక్కువ మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తరపున ప్రజల్లో మానసిన స్థైర్యం పెంపొందించేలా పని చేయాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details