ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం బాటిల్​లో ఎలుక.. అవాక్కయిన మందుబాబు..!

శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ ప్రభుత్వ మద్యం షాపులో కొనుగోలు చేసిన మద్యం బాటిల్​లో ఎలుక పిల్ల దర్శనమిచ్చింది. ఓ వ్యక్తి పాలకొండ రోడ్డులో ఉన్న మద్యం దుకాణంలో బాటిల్ కొనుగోలు చేశాడు. బాటిల్​ తెరిచేందుకు ప్రయత్నించగా అందులో ఎలుక పిల్ల ఉండటంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. దీనిపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్​ అధికారులు అక్కడికి చేరుకుని మద్యం బాటిళ్లను పరిశీలించారు. అధికారుల తీరుపై పలువురు మద్యం బాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Mar 6, 2020, 8:25 PM IST

rat at wine bottile in srikakulam dst rajam
ప్రభుత్వం అందించిన మద్యం బాటిల్​ బయటపడ్డ ఎలుక!

మద్యం బాటిల్​లో బయటపడ్డ ఎలుక

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details