ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై ఎప్పుడు నిలదీస్తారు?' - సీఎం జగన్​పై ఎంపీ రామ్మోహన్ ఆగ్రహం

కేంద్ర బడ్జెట్​ను అభినందిస్తూ ప్రధానికి సీఎం జగన్ రాసిన లేఖపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం... మెరుగైన బడ్జెట్‌కు నిదర్శనమా అని ప్రశ్నించారు.

rammohan naidu comments on cm jagan lettet to pm modi
rammohan naidu comments on cm jagan lettet to pm modi

By

Published : Feb 8, 2021, 4:34 PM IST

కేంద్ర బడ్జెట్‌ను అభినందిస్తూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్.. లేఖ రాయటాన్ని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తప్పుబట్టారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరానికి నిధుల వంటి ప్రకటనలు కేంద్ర బడ్జెట్‌లో లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాజాగా.. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయం... మెరుగైన బడ్జెట్‌కు నిదర్శనమా అని సీఎం జగన్ ను రామ్మోహన్ నాయుడు నిలదీశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై ఇక ఎప్పుడు నిలదీస్తారని సీఎంను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details