శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ వద్ద ఎంపీ కింజారాపు రామ్మోహన్‌నాయుడు దీక్ష చేశారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటించినా... ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్యాయం చేశారని కేంద్రం తీరుపై మండిపడ్డారు.స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ తో కలిసి పోరుబాట పట్టారు. వాల్తేరు డివిజన్‌ను రద్దు చేయడం సరికాదన్నారు. రేపు ఉదయం పది గంటల వరకు దీక్ష కొనసాగిస్తాన్నారు.
'జోన్ పేరుతో కేంద్రం మోసం చేసింది' - ram mohan naidu deeksha at sreekakulam
కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శ్రీకాకుళంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు దీక్ష చేశారు. విశాఖకు రైల్వే జోన్ ఇచ్చినట్టే ఇచ్చి.. కేంద్రం మోసం చేసిందని ఆరోపించారు. వాల్తేర్ డివిజన్ రద్దు నిర్ణయం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామ్మోహన్ నాయుడు
TAGGED:
railway zone