ETV Bharat / state
వైద్యుల నిర్లక్ష్యం... శిశువు మృతి.. బాధితుల ఆందోళన - శ్రీకాకుళం జిల్లా
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా... శ్రీకాకుళం జిల్లా రాజాం ఆసుపత్రిలో శిశువు మృతి చెందింది. ఈ దారుణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బిడ్డ చనిపోవడానికి కారణమైన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డ మృతి
By
Published : Mar 31, 2019, 8:28 PM IST
| Updated : Mar 31, 2019, 11:29 PM IST
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రాజాం ప్రాంతీయ ఆసుపత్రిలో బిడ్డ మృతి శ్రీకాకుళం జిల్లా రాజాం సామాజిక ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందింది. రాజాం మల్లికార్జున కాలనీకి చెందిన ఉప్పల శ్రీనివాసరావు, సావిత్రి దంపతుల కుమార్తె త్రివేణిని విజయనగరం రైల్వే కాలనీకి చెందిన కాలెపు నాగేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశారు. తొలి కాన్పు నిమిత్తం కన్నవారింటికి వచ్చిన త్రివేణికి పురిటి నొప్పులు ఎక్కువగా కావడంతో... రాజాం ప్రాంతీయ ఆసుపత్రిలో గురువారం రాత్రి ఒంటిగంటకు చేర్పించారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. త్రివేణికి బిడ్డ పుట్టిన సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు. ఆదివారం ఉదయం బిడ్డ చనిపోయిందని వైద్యులు చెప్పడంతో... కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ దారుణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బిడ్డ చనిపోవడానికి కారణమైన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవి చూడండి...
Last Updated : Mar 31, 2019, 11:29 PM IST