శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి రైల్వే కూలీలను తీసుకెళ్లి.. తిలారు వద్ద రైల్వే ట్రాక్ పనులు చేయిస్తున్నారు. ఈ నిమిత్తం రైల్వే సిబ్బందిని శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో తరలిస్తున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ అధికారులు జాగ్రత్తలు మరిచారు. వందల మంది కూలీలను ఒకే బోగీలో భౌతిక దూరం, మాస్కులు లేకుండా తరలించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొందరు కూలీలు ఆవేదన చెందుతున్నారు.
కరోనా వేళ.. ఒకే బోగీలో వందల మంది ప్రయాణం! - ఆముదాలవలస తాజా వార్తలు
కరోనా వేళ భౌతిక దూరం తప్పనిసరి. కోవిడ్ నివారణకు నిబంధనలు పాటించాల్సిందేనని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కొందరు మాత్రం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రైల్వే ట్రాక్ పనులు కోసం కూలీలందరినీ ఒకే బోగీలో వ్యక్తిగత దూరం లేకుండా పంపిస్తున్నారు. కరోనా విస్తరిస్తున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు అంటున్నారు.
కరోనా వేళ.. బోగీలో వందల మంది ప్రయాణం