శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద లొద్దపుట్టి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. రెవెన్యూ సేవల కోసం ఫోన్లో సంప్రదించిన జోగారావు అనే వ్యక్తితో.. వీఆర్వో రాజారెడ్డి అసభ్యకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. తమతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని లొద్దపుట్టివాసుల ఆందోళన
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట లొద్దపుట్టి వాసులు నిరనస చేపట్టారు. తమతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇచ్చాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరనస