ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్‌ క్వార్టర్స్‌లో కూలిన గోడ.. కానిస్టేబుల్‌కు గాయాలు - పోలీస్‌ క్వార్టర్స్‌

పోలీస్‌ క్వార్టర్స్‌ భవనం గోడకూలి కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

police-quarter-collapse

By

Published : Jun 1, 2019, 2:10 PM IST

పోలీస్‌ క్వార్టర్స్‌ భవనం గోడకూలి కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోలీస్‌ క్వార్టర్స్‌ భవనం గోడకూలి.. తిరుపతిరావు అనే కానిస్టేబుల్‌ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని.. వైద్యులు తెలిపారు. సుమారు 20 ఏళ్ల కిందట నిర్మించిన ఈ క్వార్టర్స్‌లో.. 24 పోలీసు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. భవనాలు పెచ్చులూడి శిథిలావస్ఖకు చేరుకున్నాయని.. తరచూ శకలాలు కింద పడుతున్నాయని పోలీసు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదంటున్నారు. ఇప్పటికైనా నూతన క్వార్టర్స్‌ని నిర్మించాలని పోలీసు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details