పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో 'జాతి నిర్మాణంలో పోలీసు పాత్ర' అనే అంశంపై ఎస్పీ అమిత్ బర్ధార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయడం చాలా అవసరమని.. సామాన్య మానవుడు సంతృప్తి చెందేలా పనిచేయడమే గొప్ప జాతి నిర్మాణామని ఎస్పీ పేర్కొన్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే.. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ అమిత్ బర్దార్ కోరారు.
'జాతి నిర్మాణంలో పోలీసు పాత్ర' అంశంపై అవగాహన సదస్సు - శ్రీకాకుళంలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ
సాంకేతికతతో అనుసంధానం కావడం ద్వారా.. పోలీసు వ్యవస్థలో సుపరిపాలన సాధ్యం కాగలదని శ్రీకాకుళం ఎస్పీ అమిత్‌బర్దార్ పేర్కొన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించడంలో స్నేహపూర్వక వాతావరణంలో పోలీసుల పనితీరు ఉండాలని ఆయన సూచించారు.
మాట్లాడుతున్న ఎస్పీ