ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..హత్యే కారణమా..? - suspicious deaths in srikakulam news

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారి వంతెన కింద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

died person
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

By

Published : Dec 1, 2020, 10:08 AM IST

శ్రీకాకుళం జిల్లా బుడుమూరు జాతీయ రహదారి వంతెన కింద గొర్లె రమణ(52) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అదపాక గ్రామానికి చెందిన ఇతన్ని హత్య చేయటం వల్లే మృతి చెందినట్లు భార్య రమణమ్మ ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

పోలీసులు తెలిపిన వివరాలు..
సంతకి వచ్చిన మృతుడు వంతెన కిందకు మలవిసర్జనకు వెళ్లేప్పుడు కాళ్లకు రాళ్లు తగలటంతో ఒక్కసారిగా పడిపోయాడు. తలకి రాళ్లు తగలడంతో బలమైన గాయాలయ్యాయి. అధిక రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. క్లూస్ టీం కూడా మృతదేహాన్ని పరిశీలించారని చెప్పారు.

హత్య చేశారు..
ఇంటిల్లిపాది ఉదయాన్నే గుడికి వెళ్లి వచ్చాక..కిరాణా సరుకులు కొనుగోలు చేసేందుకు బుడుమూరు సంతకి వెళ్లారని తెలిపారు. గ్రామంలో ఎవరితో ఎటువంటి తగాదాలు లేవని చెప్పారు. కానీ గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను హత్య చేసి ఉంటారని ‌భార్య రమణమ్మ ఆరోపిస్తున్నారు.

కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి: నీటి తోట్టిలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి

ABOUT THE AUTHOR

...view details