శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన చేపలు, మాంసం మార్కెట్లో కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించడం లేదు. పట్టణంలోని 80 అడుగుల రహదారిలో తాత్కాలికంగా ఏర్పాటు విక్రయ కేంద్రంలో భౌతిక దూరం పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ.. ప్రజలు పాటించడం లేదు. భౌతిక దూరం పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మార్కెట్లకు భారీగా జనం..భౌతిక దూరం పాటించని వైనం - lockdown
కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ.. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మాంసం విక్రయ కేంద్రంలో కొనుగోలుదారులు గుంపులుగా గుమిగూడుతున్నారు. ఫలితంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో గుంపులుగా వస్తువులను కొనుగోలు చేస్తున్న ప్రజలు